13 జిల్లాలకు దిక్కు లేదంటే 36 జిల్లాలు చేస్తామంటున్నారని, అభివృద్ధి కనిపించని చోట నాలుగు అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. ఆంధ్రప్రదేశ్లో కుల వ్యవస్థ బలీయమైంది. కులాన్ని వాడుకుని కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. సీఎం జగన్రెడ్డి తప్పు చేస్తే రెడ్డి సామాజిక వర్గం అంతా ఎందుకు ఇబ్బందిపడాలి? ఆ సామాజిక వర్గంలో ఎంత మంది కూలీనాలీ పనులకు వెళుతున్నారో నాకు తెలుసు. కమ్మ సామాజికవర్గం నుంచి వచ్చిన పాలకులు తప్పులు చేస్తే కమ్మవారు బలైపోయారు అని వ్యాఖ్యానించారు..పార్టీ సమాచారం ప్రజలకు పార్టీ శ్రేణులకు చేరవేసే 'జనసేన న్యూస్ లెటర్'ను ఆయన ప్రారంభించారు. పార్టీ క్రియాశీల సభ్యులకు ప్రమాదబీమా పథకానికి అధినేత కోటి రూపాయలు విరాళం అందించారు