ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ అందరికీ తెలిసిందే. అయితే విశాఖలో మాత్రం ఆ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినా కూడా టీడీపీ తమ పట్టు నిలుపుకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీని ముద్దాయిని చేస్తూ టీడీపీ అక్కడ ప్రచారం నిర్వహించింది. దీంతో 98 స్థానాల విశాఖ కార్పొరేషన్ లో కేవలం 58 స్థానాలకే వైసీపీ పరిమితం అయింది. టీడీపీకి అక్కడ 30 స్థానాలు దక్కడం విశేషం. దీంతో ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ వైసీపీ నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అధినేత జగన్ తో కూడా చర్చిస్తానని అన్నారాయన.