పెద్దల పంతంతో ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట కథ చివరకు ఆస్పత్రి వరకు చేరింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ప్రియుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆ యువకుడ్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉప్పల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.