వైసీపీ పార్టీకి ఈ గెలుపు మరో మెట్టును పైకి తీసుకెళ్ళింది. పంచాయితీ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు కూడా జరిగిందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఈ విషయం పై నేతలు, కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టణ వాసులు అదే చేశారని హర్షం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పట్టం కట్టారు. దీంతో మా ప్రభుత్వ బాధ్యత మరింత పెరిగింది. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం, దాని తోకపార్టీ జనసేన తుడిచిపెట్టుకు పోయాయని ఆయన వ్యాఖ్యానించారు.