రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర.. ఇలా అన్ని ప్రాంతాల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురవడంతోపాటు, వైసీపీ క్లీన్ స్వీప్ సాధించింది. ముఖ్యంగా చంద్రబాబు సొంత ఇలాకాలో వైసీపీ అదరగొట్టింది. ఇంకా చెప్పాలంటే తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. తిరుపతి కార్పొరేషన్లో 22 స్థానాలకు 22 స్థానాలు సాధించి వైసీపీ తిరుగులేని మెజార్టీ నిరూపించుకుంది. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే వెంకటగిరి మున్సిపాల్టీలో అన్ని వార్డులు వైసీపీకే దక్కాయి. సూళ్లూరుపేట, నాయుడుపేటలో కూడా అదే పరిస్థితి. దీంతో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలపై ఆల్రడీ ప్రజలు ఓ క్లారిటీకి ఇచ్చేసినట్టేనని తెలుస్తోంది.