తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతోపాటు మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ నాటికి పుంగనూరు మున్సిపాలిటీలోని వార్డులు అన్నీ వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి.చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతోపాటు మదనపల్లె, పలమనేరు మున్సిపాలిటీల్లోని కొన్ని డివిజన్లు, వార్డులు వైకాపా వశమయ్యాయి. నగరిలో మొత్తం 29 వార్డులకు కేవలం ఏడు మాత్రమే ఏకగ్రీవంకాగా మిగిలిన 22 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. పుత్తూరు మున్సిపాలిటీలోనూ 27 వార్డులకు కేవలం ఒక్కటే ఏకగ్రీవమైంది. మిగిలిన అన్ని స్థానాల్లోనూ పోటీ నెలకొంది.. అయితే అక్కడ గెలుపు కోసం రెండు పార్టీలు ఎవరికీ వారే అన్నట్లు గట్టి పోటీని ఇచ్చారు.నగరి మున్సిపాలిటీలో 22 వార్డులకు ఎన్నికలు జరిగితే అందులో వైకాపా 18, తెదేపా మూడు స్థానాలు గెలుచుకున్నాయి. నగిరిలో గెలిచిన అభ్యర్థులతో రోజా సంబరాలు చేసుకున్నారు.. వైకాపాకు విజయం నీడలాంటిదని వ్యాఖ్యానించారు.