ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న అమరావతికి మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుతం ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే బలము మరియు బలహీనత. ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వస్తోందంటే అమరావతికి చుట్టూ గుంటూరు మరియు వియాయవాడ లాంటి నగరాలు ఉన్నప్పటికీ వాటి చుట్టూ తగినంత భూమి ఉండగా, పైగా ఈ రెండు మహా నగరాల మధ్యలో బోలెడంత ఖాళీ స్థలముండగా, ఇవి అన్నీ చాలవన్నట్టు ఏపీలో మూడవ మహానగరాన్ని సృష్టించడానికి సిద్దమయ్యారు బాబు గారు.