ప్రైవేటీకరణపై జోరుగా నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వానికి త్వరలోనే పెద్ద షాక్ తగలబోతోంది. రెండు రోజుల సమ్మె పేరుతో రంగంలోకి దిగిన బ్యాంకు ఉద్యోగులు, అవసరమైతే రైతు పోరాటంలాగా నిరవధిక సమ్మెతో షాకిస్తామంటున్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే తమ సత్తా చూపిస్తామంటున్నారు. రెండు రోజుల సమ్మెను, సమస్య పరిష్కారమయ్యే వరకు కొనసాగించే విషయంపై చర్చలు జరుపుతున్నారు. అదే జరిగిదే దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించడం ఖాయంగా కనిపిస్తోంది.