పదే పదే చంద్రబాబు పులివెందుల పంచాయితీ అంటూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలను రాష్ట్రవ్యాప్తం చేయాలని చూస్తున్నారని, అది జరగదని అంటుంటారు. అయితే చంద్రబాబు సంగతేమో కానీ.. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వర్థంతి రోజున మాత్రం నిజంగానే పులివెందుల రాజకీయం ఏంటో బయటపడింది. గతంలో ఏ కార్యక్రమానికయినా ఉమ్మడిగా హాజరయ్యే వైఎస్ కుటుంబ సభ్యులు ఈ దఫా విడివిడిగా కనిపించారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయలక్ష్మి మాత్రమే వచ్చారు. గతంలో వారి వెంట నడిచే.. వైసీపీ నాయకులు, అభిమానులు ఈసారి లేకపోవడం విచిత్రం.