ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన వార్త జోమాటో డెలివరీ బాయ్ యువతి పై దాడి.. ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన మహిళా కస్టమర్‌పై జొమాటో డెలివరీ బాయ్ దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు డెలివరీ బాయ్ కామరాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మీద విడుదలైన కామరాజ్ సదరు యువతిపై కేసు పెట్టాడు. ఆమె తన పై ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టిందో అదే స్టేషన్ లో ఆమె పై కేసు పెట్టడం గమనార్హం..