టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు కాలు కదపకుండానే అన్ని వస్తువులు ఇంటి వద్దకే వస్తున్నాయి. తాజాగా దేబాశిష్ సాహు అనే వ్యక్తి మార్చి 11వ తేదీన తన ఆవును అమ్మడం కోసం ఆన్లైన్లో ఒక ప్రకటన ఉంచాడు. ఇది చూసిన సైబర్ నేరగాడు ఒకరు.. సాహుకు ఫోన్ చేశాడు. తన పేరు మంజిత్ అని ఆర్మీ అధికారినని పరిచయం చేసుకున్నాడు.