అనుకున్నదే జరిగింది. ఆ తల్లికి పుత్రశోకమే మిగిలింది. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ఏడేళ్ల భార్గవ్తేజ ఆచూకి కోసం వెదికిన తల్లిదండ్రులకు జీర్ణించుకోలేని నిజం కళ్లముందు కనిపించింది. ఒక్కసారిగా కుటుంబమేకాదు, మొత్తం గ్రామాన్నే కంటతడి పెట్టిస్తోంది. స్నేహితులు, బంధువులు ఎవరైనా తీసుకెళ్లి ఉంటారేమోనని ఆరా తీశారు.