అమరావతి భూముల విషయంలో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం.. ఆయన్ను విచారణకు పిలవడం చూస్తుంటే.. ఇదేదో కక్ష సాధింపు వ్యవహారం అన్న భావన ప్రజల్లో కలుగుతోంది. ఇప్పటికే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను హైకోర్టు కూడా కొట్టేసింది. సుప్రీంకోర్టులోనూ ఆ వాదన నిలవలేదు. ఇప్పుడు అదే తరహా ఆరోపణలతో చంద్రబాబును ఇరుకున పెట్టాలనుకోవడాన్ని జనం కక్ష సాధింపు అనే అనుకుంటారు. అదే నిజమైతే.. మళ్లీ చంద్రబాబుకు జనం సానుభూతి దక్కే అవకాశం ఉంది.