మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు రిజర్వేషన్ల ద్వారా చైర్మన్లు, మేయర్లు అయిన వారి స్థానాల్లో డిప్యూటీలుగా చక్రం తిప్పాలని చాలామంది ఆశావహులు పథకాలు రచిస్తున్నారు. రిజర్వేషన్ల కారణంగా మేయర్, చైర్మన్ పదవులు దక్కించుకోలేని పార్టీ సీనియర్లు.. డిప్యూటీలుగా ఎన్నికై పెత్తనం చలాయించడం అన్నిచోట్లా జరిగేదే. అయితే ఈ సారి జగన్ హయాంలో అలాంటి పప్పులేవీ ఉడకవు అని తెలుస్తోంది. డిప్యూటీలుగా ప్రతి చోటా ఇద్దర్ని ఎంపిక చేసేలా ఆర్డినెన్స్ తీసుకురాబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.