చంద్రబాబు సీఐడీ కేసులకు, బీజేపీకి సంబంధం ఏముంది? అయినా సరే ఆ పార్టీ సంతోషంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరోక్షంగా తన సంతోషాన్ని మీడియా ముందు తెలియజేశారు కూడా. రాజకీయ కక్షసాధింపు అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు. అప్పుడు లేవని నోళ్లు, ఇప్పుడు లేస్తున్నాయేం అంటూ ప్రశ్నించారు వీర్రాజు. గతంలో బీజేపీ నేతలకు ఏపీలో జరిగిన అవమానాలను ఆయన గుర్తు చేశారు.