రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని కోర్టులో సవాలు చేయాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. సీఐడీ నోటీసుల వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్న చంద్రబాబును పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది కలిసి చర్చించారు.