తిరుపతి బై ఎలక్షన్స్ లో 3 లక్షల ఓట్ల మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మూడున్నర లక్షలు సాధిస్తామంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు. అయితే వైసీపీకి ఇవన్నీ చాలా చిన్న టార్గెట్లు అంటున్నారు స్థానిక నాయకులు. అంతకు మించి మెజార్టీ సాధిస్తామంటున్నారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి రాజకీయాలకు కొత్తే అయినా, జగన్ పేరు, ఫ్యాను గుర్తుపై.. ఈజీగా పాస్ మార్కులు తెచ్చుకోవడం ఖాయం. వైసీపీ గెలుపుపై కాదు, ఇప్పుడందరి దృష్టి మెజార్టీపైనే ఉంది.