ఏపీలో వైసీపీ అందనంత ఎత్తులో ఉందన్న మాట వాస్తవమేమీ కాదు.. టీడీపీ మరీ అంతగా కుంగిపోవాల్సిన పరిస్థితి కూడా లేదు. ఇక ఏపీలో టీడీపీ అంటూ లేదు.. తుడిచిపెట్టుకుపోతోందన్న వైసీపీ ప్రచారం వాస్తవం కాదు.. విపక్షాలన్నీ ఏకమయ్యే పరిస్థితి ఉంటే.. ఇప్పటికైనా వైసీపీకి తిప్పలు తప్పకపోవచ్చన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.