ఉపాధి లభించాలంటే పరిశ్రమలు రావాలి. ఉన్న పరిశ్రమలే కాదు.. కొత్త రకంగా పరిశ్రమలు రావాలి. కొత్త రంగాల్లోకి సేవలు విస్తరించాలి. అప్పుడే యువతకి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కేంద్రం కూడా ఇప్పుడు ఇదే దృక్పథంతో ఆలోచిస్తోంది. అందుకోసం కొత్త రంగాలను అన్వేషిస్తోంది.