తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బాబు పేరు ప్రస్తావించారు. నిరుద్యోగ భృతి విషయంలో ఆవేశపడి వెనక్కి తగ్గారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ప్రయత్నించారని, కొన్ని నెలలు మాత్రమే నిరుద్యోగులు లబ్ధిపొందారని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ భృతి విషయంపై స్పందించిన కేసీఆర్, చంద్రబాబు ఉదాహరణ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగ భృతిని అమలులో పెట్టి తిరిగి ఆపేశాయని అన్నారు. అసలు తెలంగాణలో భృతి ఇవ్వాలా, వద్దా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల హామీలో నిరుద్యోగ భృతి కూడా ఉంది.