దేశంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని వణికిపోతున్నాం. ఈ ముప్పు తప్పితే చాలు అని ఆలోచిస్తున్నాం. అయితే ఇప్పుడు దానికంటే మరో పెద్ద ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు కరోనా థర్డ్ వేవ్ కూడా వస్తుందని అంటున్నారు. కావాలంటే ఫ్రాన్స్ ని ఉదాహరణగా తీసుకోండని చెబుతున్నారు. అవును ఫ్రాన్స్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చింది. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు. సాక్షాత్తూ ఫ్రాన్స్ ప్రధాన మంత్రి చేసిన ప్రకటన ఇది.