పోలవరం ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా..? ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన వార్తలతో మరోసారి ప్రాజెక్ట్ వ్యవహారం చర్చకు వస్తోంది. గోదావరి వరదలకు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని చెబుతున్నారు. దీనికి సంబంధించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా పోలవరం పనుల్ని మరోసారి పర్యవేక్షించారు. ప్రాజెక్ట్ ఏరియాకి వెళ్లిన ఆయన అధికారులు, స్థానిక నాయకులు, మేఘా సంస్థ ప్రతినిధులతో ప్రాజెక్ట్ పనుల పురోగతి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తీరుని సమీక్షించారు. పలు సూచనలు చేశారు.