అంతర్జాతీయ పరిశోధన సంస్థ నాసా అంగారక గ్రహంపై పరిశోధనలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంగారక గ్రహంపై నీటి జాడకోసం పరిశోధకులు ఇప్పటికే పలు పరిశోధనలు జరిపారు. ఈ మేరకు నాసా కొన్ని సంచలన విషయాలను బయట పెట్టింది. నాసా జరిపిన పరిశోధనలో మార్స్ గ్రహం అంతర్భాగంలో భారీగా నీటిజాడ నిక్షిప్తమై ఉండొచ్చని తేలింది.