పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార వ్యవహారాలన్నీ నిన్న మొన్నటి వరకు అమిత్ షా చూసుకునేవారు. టీఎంసీ నాయకులకు గేలం వేసే దగ్గరనుంచి బీజేపీ అభ్యర్థుల ఖరారు వరకు అన్ని విషయాలను అమిత్ షా నే డిసైడ్ చేశారు. కానీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న వేళ, ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. రెండు వారాల వ్యవధిలో ఆయన రెండు సార్లు బెంగాల్ లో పర్యటించారు. గతంలో కోల్ కతాలో ఎన్నికల ప్రచార ర్యాలీ లో పాల్గొన్న మోదీ, ఇప్పుడు పురూలియాలో సమర శంఖం పూరించారు.