కొన్ని సంఘటనలు సినిమాలో జరిగినట్టుగానే నిజ జీవితంలోను జరుగుతూ ఉంటాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెయిల్ పై విడుదలయిన ఓ వ్యక్తి తాను చనిపోయినట్టు అబద్దపు సాక్ష్యాలను సృష్టించి ఏకంగా 16 ఏళ్ల పాటు రహస్య జీవితాన్ని గడిపాడు.