వృత్తి కోసం సాహసాలు చేసే అలాంటి వారి వల్లే ప్రజలకు అనేక వాస్తవాలు తెలుస్తాయి.. సీనియర్ జర్నలిస్టు రెహానా ఆ కోవలోకే వస్తారు. కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో రిపోర్టింగ్ చేయాలంటే చాలా మంది జంకుతారు. కానీ రెహానా మాత్రం నెలల తరబడి క్లిష్టమైన ప్రాంతాల్లో రిపోర్టింగ్ చేశారు. అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు.