జగన్ సర్కారు పెట్టిన సీఐడీ కేసు పుణ్యమా అని మరోసారి హీరో అవుతున్నారు. అమరావతి భూముల విషయంలో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం.. ఆయన్ను విచారణకు పిలవడం చూస్తే ఇదేదో కక్ష సాధింపు వ్యవహారం అన్న భావన ప్రజల్లో కలిగింది. దీనికి తోడు ఇప్పుడు ఈ విచారణపై హైకోర్టు స్టే కూడా ఇచ్చేసింది. పైగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టడమేంటని ప్రభుత్వానికి తలంటింది కూడా. ఈ సీఐడీ కేసు వ్యవహారంతో జగన్ మరోసారి చంద్రబాబు ముందు జీరో అయ్యారేమో అనిపిస్తోంది.