కమల్ హాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యం పార్టీ కూడా పోటీలో దిగనుంది.గత కొద్ది రోజులుగా కమల్ ప్రచారంలో జోరు పెంచారు. అతనికి మద్దతుగా తమిళ్ సినీ లోకం కదిలింది. ప్రచారంలో సదరు నటులు కూడా పాల్గొంటున్నారు. అయితే, ఆయన తాజాగా ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేశారు. వచ్చే పదేళ్లలో తమిళనాడును ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. విద్యారంగంలో మరింతగా మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు.