విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఇబ్బంది పడినమాట వాస్తవమే. రాష్ట్రమంతా వైసీపీ వన్ సైడ్ గా విజయం సాధించినా.. విశాఖ కార్పొరేషన్లో మాత్రం టీడీపీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు తెచ్చుకోగలిగింది. పాలనా రాజధానిని విశాఖకు మారుస్తామంటున్న తరుణంలో ఇలాంటి పరిణామం జగన్ కు మింగుడు పడలేదు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారనుకున్నా కూడా.. కేంద్రంపై ఉండాల్సిన కోపం, రాష్ట్ర ప్రభుత్వంపైకి ట్రాన్స్ ఫర్ కావడంతో వైసీపీ ఇబ్బందుల్లో పడింది. టోటల్ గా విశాఖ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి సరిగ్గా పోల్ మేనేజ్ మెంట్ చేయలేకపోయారనే భావన కూడా జగన్ లో ఉన్నట్టుంది. అందుకే తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారానికి ఆయన్ని పూర్తిగా దూరం పెట్టారు జగన్.