సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్ సభకు వైసీపీకి వచ్చిన ఓట్లు 7,22,877. ఇవి కేవలం సీఎం జగన్ పాలనపై ఆశతో ప్రజలు వేసిన ఓట్లు. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుపతికి ఉప ఎన్నిక జరుగుతోంది. అంటే ఇప్పుడు వైసీపీకి వచ్చే ఓట్లు.. ఈ రెండేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినవి. 7 లక్షలకు ఎన్ని ఎక్కువ వస్తే, ప్రజలు అంత ఎక్కువగా జగన్ ని విశ్వసించినట్టు లెక్క. అప్పటి ఓట్లు జగన్ పై ఆశ అయితే, ఇప్పటి ఓట్లు జగన్ పై నమ్మకాన్ని తెలియజేస్తాయి. ఏమాత్రం ఓట్లు తగ్గినా, మెజార్టీ తగ్గినా, ప్రతిపక్షాల హడావిడి తట్టుకోలేరు. అందుకే జగన్ అంత పగడ్బందీగా తిరుపతి కోసం స్కెచ్ వేశారు.