ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సభా హక్కుల నోటీసుకి స్పందిస్తూ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమాధానలో ఆయన కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాను, అందుకే బయటకు రాలేను అని మెన్షన్ చేశారు. దీన్నిప్పుడు వైరి వర్గాలు హైలెట్ చేస్తున్నాయి. గతంలో తాము వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డంకి అవుతాయి, వాయిదా వేయమంటే రకరకాల కారణాలు చెప్పిన నిమ్మగడ్డ, ఇప్పుడు టీకా వేయించుకుని ఇంట్లో ఎందుకు కూర్చున్నారంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.