నేటి సమాజంలో చాల మంది యూ ట్యూబ్ ని చూసి చాల నేర్చుకుంటున్నారు. మరికొంత మంది ప్రయోగాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన గర్భిణీకి ఆస్పత్రిలో పనిచేసే ఓ వ్యక్తి బ్లేడుతో ఆపరేషన్ చేయడంతో తల్లీబిడ్డ ఇద్దరు మృతి చెందారు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.