ఉద్యోగి గురించి విచారణ నిర్వహించిన పోలీసులు అదిరిపోయే విషయం బయటపెట్టారు. అదేంటంటే.. శ్రీనివాసరావు.. ఉద్యోగాల పేరుతో ఇద్దరి వద్ద రూ.50 లక్షలు వసూలు చేశాడట. శనివారం ఉదయం ఉద్యోగాల ప్రకటన వస్తుందని నమ్మించాడట. అంతే కాదు.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరో 16 మందిని నమ్మించాడట. ఆ విషయం నుంచి పక్కదోవ పట్టించేందుకు ఇలా ఆత్మాహుతి డ్రామా ఆడాడని పోలీసులు చెబుతున్నారు.