నూతన ఇసుక విధానం ద్వారా ఏపీలో ఇసుక అమ్మకాలను జేపీ గ్రూప్ దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్వహించిన టెండర్లలో.. రాష్ట్రంలో ఇసుక తవ్వకం, నిల్వ, అమ్మకం వ్యవహారాలను ఢిల్లీకి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీ పవర్) సొంతం చేసుకుంది. ఏడాదికి గాను ఈ సంస్థ అత్యధికంగా 765కోట్ల రూపాయలు కోట్ చేసింది.