దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలై రెండు నెలలు పూర్తయినా.. అనుకున్నంత వేగంగా ఆ ప్రక్రియ కొనసాగడంలేదనే ఆరోపణలున్నాయి. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. అయితే వారిలో చాలామంది వెనకగుడు వేయడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో ఏపీ సర్కారు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత సులభతంరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెట్టబోతోంది.