టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆ రాజీనామా సంగతేంటని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం కష్టం. అయితే తనతోపాటు అందరూ రాజీనామాలు చేయాలని, అప్పుడే ప్రైవేటీకరణ నిర్ణయం ఆగిపోతుందని చెప్పిన ఆయన.. మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే దశలో ఆయన టీడీపీతో అంటీ ముట్టనట్టుగా ఉండటం కూడా మరో విశేషం. ఉక్కు ఉద్యమంలో సొంతంగా తన ఇమేజ్ పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు గంటా.