చాలా మంది పంటి నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. పంటి నొప్పి ఎంత బాధిస్తుందో ఆ అనుభవాన్ని ఎదుర్కొన్న వారికే తెలుస్తుంది. సహజంగా పుప్పిళ్లు, దంతాళ్లో పగుళ్లు, చిగుర్లు ఉబ్బడం వల్ల పంటినొప్పి సమస్య వస్తుంది. అయితే సాధారణ పంటి నొప్పి, చిగుళ్లు ఉబ్బడం వల్ల కలిగే నొప్పిని కొన్ని సహజ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చనే విషయం మీకు తెలుసా..?