ముంబయిలో భారీగా నిధుల వసూలు చేయాలని హోంమంత్రి పోలీసులకు టార్గెట్లు విధించే వారట. నెలకు కనీసం రూ.100 కోట్లు వసూలయ్యేలా చూడాలని హోంమంత్రి వాజేకు చెప్పినట్లు లేఖలో రాశారు. ముంబయిలో 1750 బార్లు ఉన్నాయని, వాటి నుంచి 2, 3 లక్షలు వసూలు చేసినా.. నెలకు 40 నుంచి 50 కోట్ల లక్ష్యం సాధించవచ్చని హోంమంత్రి చెప్పేవారట.