ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఇసుక తవ్వకాలు, కొనుగోలు, అమ్మకాలను ఢిల్లీకి చెందిన జేపీ పవర్ కి కట్టబెట్టింది. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ ద్వారానే ఈ తంతు పూర్తి చేసినా కూడా ప్రభుత్వానికి విమర్శలు తప్పలేదు. ఇసుక పేరుతో రాష్ట్రాన్ని దోచుకోడానికి రంగం సిద్ధం చేసుకున్నారంటూ టీడీపీ నేతలు విమర్శించారు. అటు జనసేన కూడా ఇసుక పాలసీని తీవ్రంగా తప్పుబడుతోంది.