ప్రముఖ మొబైల్ కంపెనీ యాపిల్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. మొన్నీమధ్య ఇయర్ ఫోన్ సరిగ్గా లేవని కంపెనీ పై కేసు నమోదు అయ్యింది. అది అయ్యిందో లేదో ఇప్పుడు మరొక సమస్య వచ్చి పడుతుంది. ఓ కస్టమర్ ఫోన్ తో పాటుగా ఛార్జర్ ఇవ్వలేదని కోట్లకు ఫైన్ వేశాడు. వివరాల్లోకి వెళితే..ఛార్జర్ లేకుండా మొబైల్‌ను విక్రయిస్తున్నందుకు అక్కడి వినియోగదారుల ఫోరం సుమారు ₹15 కోట్ల (2 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించి ఛార్జర్ లేని మొబైల్‌ను విక్రయించినందుకు గానూ ఈ జరిమానా విధిస్తున్నట్లు ఫోరం వెల్లడించింది.