ఏపీలో పోలీసుల పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ కి అవార్డుల మీద అవార్డులొస్తున్నాయి. 14 నెలల కాలంలో జాతీయ స్థాయిలో 125 అవార్డులు ఏపీ పోలీస్ విభాగం సొంతం చేసుకుంది. ఈ ఏడాది 17 జాతీయ స్థాయి అవార్డుల మన అధికారులు అందుకున్నారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్ గా నిలుస్తోంది. తాజాగా రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయస్థాయిలోని మూడు సంస్థలు అవార్డులు ప్రకటించాయి. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు గౌతమ్ సవాంగ్ కి దక్కింది.