తెలంగాణ ఉద్యమంలో జేఏసీని నడిపించిన కోదండరాం.. పదవులకోసం ఎప్పుడూ పాకులాడిన సందర్భాలు లేవు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంతో విభేదించి, ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసి తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం లేదు. అప్పటినుంచి ఆయన ప్రతి ఎన్నికలలోనూ సత్తా చాటాలని చూస్తూనే ఉన్నారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలపై కోదండరాం భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ విజయం సాధించకపోగా కనీసం రెండో స్థానం కూడా కోదండరాంకి దక్కలేదు. దీనికి కారణం కేసీఆరేనని ఆరోపించారు కోదండరాం.