కరోనా సెకండ్ వేవే ఉధృతంగా ఉంటే.. మళ్లీ లాక్ డౌన్లు తప్పకపోవచ్చు. అప్పుడు ఉద్యోగాలకు మరింత కష్టం వచ్చే అవకాశం ఉంది. కరోనా సమయంలో ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. ఆర్థికంగా కుదేలయ్యాయి. అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి కరోనా దెబ్బ రుచి చూశాం కాబట్టి.. ఆ అనుభవంతోనైనా ఈసారి జాగ్రత్త పడటం ఉత్తమం.