చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల సైకాలజీని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు.. రాజకీయ పార్టీల అధినేతలపై, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అభిమానం, గౌరవం అయినా ఉండాలి లేదా భయం ఉండాలి. చంద్రబాబు విషయంలో తెలుగుదేశం శ్రేణులకు ఈ రెండూ లేవు... ఈ రాతలు చూస్తే ఏదో సాక్షి పత్రిక చదువుతున్నట్టు ఉందా.. కానీ.. ఇవి అక్షరాలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్వయంగా తన కొత్త పలుకు వ్యాసంలో రాసిన రాతలు.