బెజవాడ రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో రాజకీయం బాగా రంజుగా ఉంటుంది. ఇక్కడ సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడదు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతల మధ్య జరిగిన రచ్చ ఏంటో అందరికీ తెలిసిందే. ఎంపీ కేశినేని నాని, బోండా ఉమా-బుద్దా వెంకన్నలకు అసలు పొసగలేదు. ఒకరిపై ఒకరు డైరక్ట్‌గా విమర్శలు చేసుకున్నారు. అధినేత చంద్రబాబు వార్నింగ్‌లు ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఏదో ఆయన విజయవాడ వచ్చినప్పుడు కలిసిపోయినట్లు నడిచారు. కానీ తర్వాత మళ్ళీ మాములుగానే రచ్చ నడిచింది.