ఏపీలో మరో ఎన్నికల పోరు మొదలైంది. ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున బల్లి దుర్గా ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఆయన గత ఏడాది కరోనాతో మరణించడంతో తిరుపతి స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు మరోసారి హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్ధులు ఖరారైపోయారు. అటు జనసేన మద్ధతుతో బీజేపీ అభ్యర్ధి తిరుపతి బరిలో నిలబడుతున్నారు.