ఏపీలో ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ మీద అధికార వైసీపీ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అసలు టీడీపీని చిత్తుగా ఓడించింది. అలాగే మూడు రాజధానుల్లో కీలకంగా ఉన్న విశాఖపట్నంలో సైతం వైసీపీ జెండా ఎగిరింది. విశాఖ కార్పొరేషన్ని వైసీపీ సొంతం చేసుకుంది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ సత్తా చాటింది. విశాఖ నగరం పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లు టీడీపీనే గెలుచుకుంది.