ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 7,14,924 లక్షల రూపాయలను ఆదాయపు పన్నుగా చెల్లించినట్టు ప్రభుత్వం చెబుతోంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈ ఉత్తర్వులుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే పన్ను కట్టేది జీతానికి కాదని.. సీఎం హోదాలో జగన్ చేయించుకున్న వైద్యానికి, బీమాలకూ కట్టిన ఫీజులకు పన్ను అని వైసీపీ మద్దతు దారులు కొందరు వాదిస్తున్నారు.