సచివాలయ ఉద్యోగాల భర్తీతో రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేసిన జగన్ సర్కారు.. ఇప్పుడు డీఎస్సీ విషయంలో మాత్రం అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు అభ్యర్థులు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కూడా ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, అటు టెట్ కి కూడా సరైన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంపై మండిపడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే, తాజాగా ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీ మరింత సంచలనంగా మారింది.