తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఏపీ సర్కారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. సెకండ్ వేవ్ వల్ల కలిగే ముప్పు గురించి ప్రజలకు మరింతగా వివరించి చెప్పేలా 15 రోజుల పాటు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 24 నుంచి ఏప్రిల్ 7 వరకు రోజువారీ ప్రచార కార్యాచరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వాక్సినేషన్ ఆవశ్యకతతో పాటు కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు పలు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.